చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని గవర్నరుని కోరతాం. గవర్నరు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళతాం. పోసాని మీద పెట్టిన సెక్షన్లే చంద్రబాబు మీద కూడా పెట్టవచ్చు. చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తాం’ అని అన్నారు.