పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్?

72చూసినవారు
పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్?
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం పోలీసులను అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదే పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా రౌడీషీట్ తెరవాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రికార్డులు సిద్ధం చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్