‘ఏపీకి సంజీవని ప్రత్యేక హోదా’ అని..హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ‘నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యం’ అని ఆమె అన్నారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చంద్రబాబును ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.