మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న 'SSMB 29'లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. దీనికి తగ్గట్లుగా ఆమె తాజాగా లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీంతో ఆమె మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ అభిమానులు అంటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.