మెగా పవర్ స్టార్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా పైరసీని కేబుల్ టీవీలో ప్రదర్శించిన యజమానిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. విశాఖ పోలీసులు అప్పలరాజుకు చెందిన 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసులో రైడ్స్ చేశారు. పైరసీ చేస్తున్నట్లు గుర్తించి పరికరాలు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. కాగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.