సంప్రదాయ చేతి వృత్తుల వారికి సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్రం పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తొలి విడతలో రూ.1 లక్ష చొప్పున, రెండో విడతలో రూ.2 లక్షలు ఇస్తుంది. కమ్మరి, క్షురకులు, వడ్రంగులు, తాపీ పని, చెప్పులు కుట్టే వారు ఈ పథకానికి అర్హులు. శిక్షణలో రోజుకు రూ.500లు, పనిముట్ల కొనుగోలుకు రూ.15 వేలు ఇస్తారు. pmvishwakarma.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.