TG: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాటశాలల్లో 6 వ తరగతిలో (2025-26) ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలోని 23 పాఠశాలల్లో 1,380 సీట్లను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 16లోగా ఆన్‌లైన్ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. వెబ్‌సైట్: https://tsemrs.telangana.gov.in/