పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో ముగిసిన సోదాలు

549చూసినవారు
పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో ముగిసిన సోదాలు
మదనపల్లె ఫైళ్ల దగ్ధం వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హైదరాబాదులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ నివాసంలో సోదాలు ముగిశాయి. ఏపీ పోలీసులు నిన్న రాత్రి నుంచి హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీలో ఉన్న శశికాంత్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు శశికాంత్ నివాసంలో భారీగా ఫైళ్లను గుర్తించారు. పోలీసులు అతడి నివాసం నుంచి నాలుగు పెట్టెల నిండా ఫైళ్లను తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్