బస్సుకు నిప్పుపెట్టిన డ్రైవర్.. నలుగురు మృతి (VIDEO)

61చూసినవారు
పూణెలో దారుణం చోటుచేసుకుంది. తనకు శాలరీ ఇవ్వలేదని కోపోద్రిక్తుడైన మినీ బస్సు డ్రైవర్ సదరు కంపెనీకి చెందిన బస్సుకు నిప్పంటించాడు. దీంతో బస్సులోని నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ మంటల్లో నిందితుడు జనార్ధన్ హంబార్దేకర్‌కు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. డిశ్చార్జి అయిన వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్