ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ నేడు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'విజయవాడలో పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. AP-SG సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభినందించాల్సిందే' అని ట్వీట్ చేశారు.