కోనసీమ జిల్లా పి. గన్నవరం బహిరంగ సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, చట్టబద్ధంగా కులగణన చేస్తామని తెలిపారు. సబ్ ప్లాన్ ద్వారా బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బడుగుబలహీన వర్గాలకు న్యాయం చేస్తామన్నారు.