AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లలేదని చెప్పారు. కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందన్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో చంద్రాబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు.