సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ రైళ్లను నడపనున్నారు. జనవరి 10న తిరుపతి- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది. జనవరి 10న సికింద్రాబాద్-కాకినాడ, జనవరి 11న కాకినాడ టౌన్- సికింద్రాబాద్, జనవరి 12న సికింద్రాబాద్- కాకినాడకు మరో ట్రైన్ నడపనుంది.