నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గా ప్రాంతం నుండి చేతులకు గొలుసులతో, తాళాలతో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి జంగాలదరువు గ్రామంలోని మధుసూదన్ రావు తోట వద్ద గత ఐదు రోజులుగా రోడ్డు పై పడి ఉన్న ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. బుధవారం సంగం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తోట యజమాని మధుసూదన్ రావు తెలిపారు. దర్గా వద్ద వీరిని సంరక్షించే కేర్ టేకర్స్ ఈ వ్యక్తిని గుర్తించి తీసుకెళ్లాలని కోరుతున్నారు.