రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ఎన్నో ఏళ్ల పాటు బ్రిటిషర్లు భారతదేశ ప్రజలను బానిసలు చేశారని ఎందరో ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చారన్నారు. ఆగస్టు 15 అంటే వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.