నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతుందని, సాయంత్రంలోగా పూర్తిస్థాయిలో పెన్షన్లు పంపిణీ చేస్తామని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ షేక్ పజుల్లుల్లా తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇచ్చిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు మున్సిపాలిటీ ఏఈ ప్రసాద్, టిడిపి నాయకులు పిడికిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.