ఆధునిక భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ లో హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థినులు చైత్ర, హరిత జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల వేషధారణలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, మదీనా మహేష్, వెంకటేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మాధవి తదితరులు ఉన్నారు.