స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉలవపాడు ఎస్సై బాజీరెడ్డి ఉత్తమ ఎస్ఐగా ప్రశంసా పత్రం పొందారు. గురువారం నెల్లూరు పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పి కృష్ణ కాంత్ చేతుల మీదగా ఉత్తమ ఎస్ఐ గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఉలవపాడు మండలంలో శాంతి భద్రత తో పాటు కేసులు పరిష్కారంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు ఎస్సైను అభినందిస్తూ ఎస్పీ ప్రశంసా పత్రం అందజేశారు.