మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కు కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తట్టపర్తి రమేష్ ఆధ్వర్యంలో కావలిలో బుధవారం ఆర్యవైశ్య ప్రముఖులు ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, గవర్నర్ గా అనేక రకాల సేవలను ప్రజలకు అందించిన మహానుభావుడు రోశయ్య అని కొనియాడారు.