కావలి: ఎమ్మెల్యే చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వం స్వీకరణ
నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరుకు చెందిన తెలుగుదేశం నాయకుడు సింగమనేని శేషగిరి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. గురువారం లక్ష రూపాయలు చెల్లించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. సభ్యత్వ కార్డును కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. శాశ్వత సభ్యత్వం తీసుకున్న శేషగిరిని శాసనసభ్యులు తో పాటు పలువురు నాయకులు అభినందించారు.