అశ్వ వాహనంపై కోదండరాముడు

63చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పెద్దూరు శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్ప అలంకరణతో మంగళ వాయిద్యాలతో స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్