విడవలూరు మండలంలోని వావిళ్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్న పాఠశాలలో ఆదివారం ఉదయం మెగా అభిమానులు రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.