ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం అమరావతిలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రశాంతి రెడ్డి జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీరాజ్ కు సంబంధించి గ్రామీణ రోడ్లు, ఇతర అంశాలను ప్రస్తావించారు.