నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రామలింగపురం అండర్ బ్రిడ్జి క్రింద ఆదివారం ఒక్కసారిగా చెట్టు కొమ్మలు విరిగి పడిపోవడంతో అక్కడ ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. నిత్యం మందలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి అయితే ఎవరికి గాయాలు కాకపోవడం అదృష్టం అనే చెప్పవచ్చు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.