గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానం ముందు మంగళవారం 1001 టెంకాయలను కొట్టారు. కార్యక్రమంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ కుమార్, కాకు మురళి, ఈవో గిరి కృష్ణ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.