దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తూ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని వీడియో ద్వారా వివరించారు. ఉత్తర కొరియా దాడుల భయం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘‘ప్రతిపక్షాలు దేశానికి ద్రోహం చేశాయి. ఉత్తర కొరియాతో అవి చేతులు కలిపాయి. దేశ భద్రత కోసమే అత్యవసర సైనిక పాలన నిర్ణయం’’ అని యూన్ సుక్ యోల్ ప్రకటించారు.