అమరావతి పనులకు మళ్లీ టెండర్లు.. సర్కారు కీలక నిర్ణయం

64చూసినవారు
అమరావతి పనులకు మళ్లీ టెండర్లు.. సర్కారు కీలక నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి పనులకు మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అమరావతిలో ఆగిన పనులపై ఇంజినీర్లతో కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నివేదిక మేరకు టెండర్లు రద్దు చేసి, మళ్లీ పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. రూ.11,471 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్