భారీ వర్షాలు వస్తే నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో నీరు నిలిచి పలు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి నుంచి ఇక ఉండదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, గోమతి నగర్ లో షుమారు 35 లక్షల రూపాయల నిధులతోఆ సి. సి. డ్రైన్ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక కార్పొరేటర్ జ్యోతి ప్రియ, నూకరాజు మదన్ కుమార్ పాల్గొన్నారు.