నెల్లూరు: రెడ్ బుక్ పేరుతో కూటమి రాక్షస పాలన

53చూసినవారు
నెల్లూరు: రెడ్ బుక్ పేరుతో కూటమి రాక్షస పాలన
రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట కూటమి రాక్షస పాలన చేస్తుందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం నేతల దాడిలో గాయాలపాలై, చికిత్స పొందుతున్న ముత్తుకూరు మండల బిట్-2 ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లును సోమవారం ఆయన పరామర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్