నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో టిడ్కో గృహాల తాళాలు అందుకున్న లబ్ధిదారులంతా ఈనెల చివరి నాటికి గృహప్రవేశాలు చేయాలని కమిషనర్ సూర్య తేజ సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం నెల్లూరులో ఒక ప్రకటన ద్వారా వివరాలను తెలియజేస్తూ టిడ్కో గృహాల ప్రాంగణాలలో నూతనంగా వీధి దీపాలను ఏర్పాటు చేశామని, పారిశుద్ధ్య కార్మికులకు నిరంతరం విధులు కేటాయించి ప్రాంగణాలన్నిటిని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దామన్నారు.