నెల్లూరు జిల్లా పొదలకూరు హౌసింగ్ డీఈఈ గా జహీరుద్దీన్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న గృహాలను త్వరితగిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా అర్హులైన వారికి గృహాలు మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. కాగా వెంకటగిరి లో పనిచేస్తున్న ఆయన బదిలీపై పొదలకూరు వచ్చారు.