నెల్లూరు: లా పరీక్షల సందర్భంగా రసాభాసా
నెల్లూరు వీఆర్ పీజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన లా పరీక్షలు వివాదాల నడుమ సాగాయి. పలువురు విద్యార్థులు తాము నగదు ఇవ్వలేదనే సాకుతో డిబార్ చేయడానికి స్క్వాడ్ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్క్వాడ్ సభ్యులు అవమానకరంగా మాట్లాడుతున్నారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులు కొందరు స్క్వాడ్ సభ్యుల మధ్య వివాదం సాగింది. సీఐ కోటేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు.