నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వారిని జనసేన జాతీయ మీడియా కన్వీనర్ వేములపాటి అజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ఎక్కువ సభ్యత్వాలు చేయించిన వరికుంటపాడు మండల జనసేనపార్టీ మండల అధ్యక్షులు రసూల్ పఠాన్ ను గురువారం అజయ్ కుమార్ అభినందించి ప్రశంసా పాత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేనపార్టీ పాయింట్ అఫ్ కాంటాక్ట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.