ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి 2 తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయగిరి లోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగాయి. విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ. 1947 ఆగస్టు 15వ తేదీన వందల ఏండ్ల బ్రిటిష్ ల బానిసత్వం నుండి విముక్తి పొందిన రోజు అందువలన ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ స్వాతంత్ర దినోత్సవం వెనుక ఎందరో వీరుల త్యాగఫలం ఉందన్నారు.