నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో బుధవారం ఏపీ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ ప్రధాని పిలుపుమేరకు గ్రామస్థాయిలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని ఎంఈఓ ఆనందరావు తెలిపారు. దేశ సమైక్యత దెబ్బతింటున్న పరిస్థితుల దృష్ట్యా యువత ముందుకు రావాలని కోరారు.