వింజమూరు రైతు భరోసా కేంద్రంలో వింజమూరు, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల విఏఏ, విహెచ్ఎల శిక్షణ తరగతులు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలన్నారు. రైతులకు అధిక దిగుబడి సాధించే విధానాన్ని వివరించాలన్నారు. ఈ పంట నమోదు చేసి ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు.