వరికుంటపాడు మండలం లోని శ్రీ గోదాదేవి పద్మావతి దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గుర్రం వెంకటేశ్వర్లు, పద్మావతి దంపతులు గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవస్థానం కమిటీ సభ్యులు పూజారులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదం అందజేసి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. అలాగే పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.