నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయగిరి వైసిపి ఇన్ ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి భారీగా వైసిపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. వారిని ఉద్దేశించి మేకపాటి మాట్లాడారు.