తప్పిపోయిన 8 ఏళ్ల బాలిక ఆచూకీని అనంతపురం రూరల్ పోలీసులు గంటలోనే ఛేదించారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన రఫీ, అక్బర్ బీ దంపతులు కుటుంబంతో సహా అనంతపురం జిల్లా గూగూడుకు వచ్చారు. అక్కడ ఓ వేడుకలో పాల్గొని నగరంలోని ఇంద్రజిత్ గుప్తా కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఆ దంపతుల కూతురు షేక్ హీనా ఇంటి నుంచి తప్పిపోయింది. పోలీసులను ఆశ్రయించగా పాపను కనుగొని బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు.