ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కోసం ఏకసభ్య కమిటీ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అనంతపురం వచ్చారు. సోమవారం కలెక్టరేట్ లో పలువురి నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం షెడ్యూల్ కులాల వర్గీకరణపై వివిధ కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.