అనంతపురం నగర పాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు వర్కర్లకు ప్రతి నెలా జీతాలు పంపిణీ చేయాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సామ్రాట్ కేబీ మధు మాదిగ బుధవారం డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు వర్కర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా పనిచేస్తున్న అధికారులపై కలెక్టర్ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.