అనంతపురం: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

50చూసినవారు
అనంతపురం: ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ వెంకట నాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సోమశేఖర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిమ్మప్ప, ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్