రేపు ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు

78చూసినవారు
రేపు ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు
ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి కసాపురం, మురడి, నేమకల్లుకు శనివారం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. శ్రావణమాసం సందర్భంగా ప్రతి మంగళ, శని వారాల్లో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామన్నారు. బస్సు టికెట్లకు రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేశామని, ఆసక్తి గల ప్రజలు ఆర్టీసీ డిపో వద్దకు వచ్చి రిజర్వేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్