ధర్మవరంలో ఆకాశాన్ని తాకిన పూల ధరలు

61చూసినవారు
ధర్మవరంలో ఆకాశాన్ని తాకిన పూల ధరలు
శ్రావణ మాసంలో వరుస శుభకార్యాలు, వరలక్ష్మీ వ్రతం కారణంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి. ధర్మవరం పట్టణంలో గత నెలలో మల్లెల ధర కేజీ రూ. 550ల ఉండగా శుక్రవారం రూ. 1, 500 పలుకుతోంది. తెల్ల చామంతి రూ. 200 నుంచి రూ 350, పసుపు చామంతి రూ. 150 నుంచి రూ. 400, కనకాంబరం రూ. 100 నుంచి రూ. 300, లిల్లీ రూ. 150 నుంచి రూ. 500, జాజులు రూ. 300 నుంచి రూ 1, 200 కు చేరాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్