గుత్తి స్పెషల్ సబ్ జైల్లో బుధవారం సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ చారి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వంట గది, టాయిలెట్స్, సెల్స్ పరిశీలించారు. అనంతరం జైలు సూపరిండెంట్ మహేశ్వరుడుతో కలిసి గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ ఖైదీలందరూ సత్ప్రవర్తనను అలవర్చుకోవాలన్నారు. సత్ప్రవర్తనను కలిగి ఉంటే మీతో పాటు సమాజానికి మేలు జరుగుతుందన్నారు.