అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ లోని ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆనందరావు (80) శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావును ఆసుపత్రిలో వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో మరణించారు. ఆనంద్ రావు మరణం పట్ల పాస్టర్లు, క్రైస్తవ సంఘం సభ్యులు, క్రైస్తవులు సంతాపం ప్రకటించారు.