గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 8వ సచివాలయంలో మున్సిపల్ ఛైర్మన్ వన్నూరుబి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. సచివాలయంలో సమస్యల గురించి ఆరా తీశారు.