గుత్తి మున్సిపాలిటీలో మంగళవారం శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గాంధీచౌక్ వద్ద ఉన్న కిరాణా దుకాణాలను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల నిర్వహకులకు చెత్తను రోడ్డు మీద వేస్తే చర్యలు తప్పవని తెలిపారు.