నల్లచెరువు మండలం జోగన్నపేట రెవిన్యూ పరిధిలోని పి. కొత్తపల్లి గ్రామ సచివాలయం వద్ద గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజల నుండి సమస్యలపై ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో, రెవెన్యూ అధికారులు, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.