కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యామ్నాయ విత్తనాలను శుక్రవారం రైతులకు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 80 శాతం రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గురువారం మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సచివాలయంలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే పలు అంశాలను వెల్లడించారు. వ్యవసాయ శాఖ ఏడీ, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి రైతులు పాల్గొన్నారు.